గంగాధర డిసెంబర్ 24 : గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో పారిశుధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ బుధవారం గ్రామంలో ఉన్న చికెన్ సెంటర్ల యజమానులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో గ్రామంలో నడుపుతున్న చికెన్ సెంటర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి కోడి నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను ఎక్కడబడితే అక్కడ వేస్తున్నారని వారికోసం వరద కాలువ వద్ద జెసిబితో కందుకం తవ్వించడం జరిగిందని దీనిని చికెన్ సెంటర్ యజమానులు వినియోగించుకోవాలని, మన ఊరు మధ్యలో ఎక్కడబడితే అక్కడ వేస్తే వారికి రు.10,000లు జరిమానా వేయడం జరుగుతుందని హెచ్చరించారు. మన ఊరు మధ్యలో ఎక్కడపడితే అక్కడ వేస్తే ఎవరైనా చూసి గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియజేసిన వారికి రు.3000లు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, చికెన్ సెంటర్ల యజమానులు పాల్గొన్నారు.









