ఈనెల 27న కరీంనగర్ పార్లమెంట్ స్థాయి నూతన సర్పంచ్ లకు సన్మానం.

కరీంనగర్ డిసెంబర్ 24 : కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులను ఘనంగా సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉ.11:00గం.కు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటరీ స్థాయి, శాసనమండలి, శాసనసభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు హాజరవుతారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సమావేశానికి లోక్ సభ పరిధిలోని కార్పొరేషన్ చైర్మన్లు, గ్రంధాలయ సంస్థ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆయా నామినేటెడ్ హోదాలలో ఉన్న నాయకులు, ముఖ్య నేతలు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపు ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు