బీమాతోనే కుటుంబానికి ఆర్థిక భరోసా – కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా రూ. 95 లక్షల క్లెయిమ్ అందజేత.

కరీంనగర్ డిసెంబర్ 24 : జీవితంలో సంభవించే అనుకోని ప్రమాదాల సమయంలో సరైన బీమా రక్షణే కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుందని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ కాశబోయిన వీరస్వామి పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన పాలసీదారుడు చిలివేరి రాజేష్ కుమార్ కుటుంబానికి మంజూరైన రూ. 95 లక్షల క్లెయిమ్ మొత్తాన్ని బుధవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా నామినీకి అందజేశారు.​గత సెప్టెంబర్ 23న జరిగిన ప్రమాదంలో రాజేష్ కుమార్ మృతి చెందడం పట్ల వీరస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు, సంస్థ నిబంధనల ప్రకారం క్లెయిమ్ ప్రక్రియను అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసి రాజేష్ కుమార్ భార్య స్వప్నకు కేంద్ర మంత్రి ద్వారా ఈ చెక్కును పంపిణీ చేసినట్లు వివరించారు.​బీమా అనేది కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదని, అది ఒక కుటుంబానికి ఇచ్చే సామాజిక రక్షణ అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజేష్ కుమార్ ముందుచూపుతో తీసుకున్న ఈ పాలసీ నేడు వారి పిల్లల విద్యాభ్యాసానికి, కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు కొండంత భరోసాను ఇచ్చిందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బాధ్యతగా విధిగా బీమా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్స్ వీరస్వామి , ఆదర్శ్ కుమార్,అసిస్టెంట్ మేనేజర్లు చంద్రశేఖర్, శ్రీకాంత్, నవీన్, ట్రైనర్ వెంకటేష్ వర్మ,ఆపరేషన్స్ మహేందర్, మేనేజింగ్ పార్టనర్ నరేందర్ రావు, లీడర్స్ మరియు ఏజెంట్స్ పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు