ఘనంగా భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి వేడుకలు.

కథలాపూర్ డిసెంబర్ 25 : కథలాపూర్ మండల కేంద్రంలోనీ గురువారం మండల బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ…. వాజపేయి జనసంఘ్ కార్యకర్తగా,స్వయసేవకునిగా,ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ప్రధానిగా దేశానికి, బీజేపీ కి చేసిన సేవలను కొనియాడారు.1942లో భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లారన్నారు.ఆనాడు నెహ్రూ పార్లమెంటులో వాజపేయి వాగ్ధాటిని చూసి ముగ్దుడై భావి భారత ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారన్నారు. 1980లో అద్వానీతో కలిసి క్రమశిక్షణ గల సిద్ధాంతాలతో భారతీయ జనతా పార్టీని స్థాపించారన్నారు. ప్రధానిగా దేశీయ ఆర్థిక,రక్షణ రంగాల్లో మౌలిక సంస్కరణలు చేపట్టారని, అందుకే ఆయన జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినోత్సవంగా జరుపుతున్నారన్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను యువత,నాయకులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి,జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరరావు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి,మాజీ మండల్ అధ్యక్షులు కంటే సత్యనారాయణ,సర్పంచ్ మల్యాల రమేష్,బద్రి సత్యం,కాసోజి ప్రతాప్,గాంధారి శ్రీనివాస్,కథలాపూర్ మహేష్,దండిక లింగం,మహేష్,శాంతారాం, ప్రసాద్,సునీల్,అనిల్,ప్రసాద్, కిషోర్,సాయి,శేఖర్,వినోద్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు