ఆర్టీసీ బస్సును నడపాలని సర్పంచ్ వినతి..
సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ నర్సప్ప
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తమ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం నిమిత్తం, ఇబ్రహీంపట్నం నుండి కడ్తాల్ మండలం, రావిచేడ్ గ్రామం వరకు ఆర్టీసీ బస్సును ఉదయం, సాయంత్రం నడపాలని, ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ నర్సప్పకు గురువారం సర్పంచ్ బొప్పిడి గోపాల్ నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు డీఎం సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే బస్సును మీ గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, నాయకులు లింగం, పవన్ కుమార్, సాయికుమార్ తదితరులున్నారు.
Post Views: 2









