జన్నారం జనవరి 9 : జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీలంక కాలనీలోనీ డ్రైనేజీల్లో, నెలల తరబడి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుక్రవారం కూలీలు, గ్రామపంచాయతీ సిబ్బంది కలసి తొలగించారు.డ్రైనేజీ పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. పూడిక తీసివేత పనులను పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ , ఉప సర్పంచ్ అప్పాల జలపతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ పర్యవేక్షించారు. కాలనీలో విద్యుత్ బల్బులను అమర్చారు.
Post Views: 2









