కడెం జనవరి 09 : కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని స్థానిక ఎమ్మెల్యే వెడమ భోజు పటేల్ అన్నారు. శుక్రవారం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు మరియు స్టికర్ల ఆవిష్కరణను కడం లో చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయులకు గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన పారితోషకం జిల్లాలోని ఉపాధ్యాయులకు రాలేదని ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారికి విన్నవించమని అంటే గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరితోసికం ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడికృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మధుకర్ మునేశ్వర్, మండల నాయకులు సుద్దాల,కడెం పెద్దూర్ సర్పంచ్ డి కొండ విజయకుమార్ ,పెద్ద బెల్లాల్ సర్పంచ్ తిరుపతి, చిట్యాల సర్పంచ్,ఏఎంసి చైర్మన్ పడగల భూషణ్,మాజీ ఎంపీ వైస్ చైర్మన్,ఆర్టీవో మెంబర్ తుంమల మల్లేష్,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, రాజేశ్వర్ మాజీ సర్పంచ్ చెన్నయ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు









