తిరుమలాపూర్ పాఠశాలలో గేమ్స్ ప్రారంభించిన సర్పంచ్ అంజయ్య..

కొడిమ్యాల జనవరి 23 : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ తైదల అంజయ్య శుక్రవారం రోజున విద్యార్థుల ఆటల పోటీలను ప్రారంభించారు. జనవరి 26 సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్,రన్నింగ్,స్కిప్పింగ్,స్టోన్ రేస్ ,తదితర ఆటల పోటీలు జరిగాయి. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తైదల అంజయ్య ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు,గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి, జ్యోస్నాదేవి, సర్పంచ్ తైదల అంజయ్య, కార్యదర్శి నవీన్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నాగరాజు, లక్ష్మీనారాయణ,ఏనుగు ఆదిరెడ్డి,బాలరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజం ,ఉపాధ్యాయులు భూపతిరెడ్డి, శంకర్, గ్రామస్తులు కోలకాని సత్యం, పోలు శ్రీను, మాదాటి సురేష్ రావు ,బొడ్డు అంజయ్య, ఆరేల్లి స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు