కొడిమ్యాల జనవరి 23 : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి నిర్వహించారు. నేతాజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవాసమితి మండల అధ్యక్షుడు కంచర్ల గంగాచారి, విశ్వహిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అంకం జనార్ధన్,తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి,రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం కొడిమ్యాల ఉప మండల ప్రముక్ మంచాల శ్రీనివాస్, స్వయం సేవకులు నాంపల్లి రామచంద్రం, కంచర్ల రామస్వామి, చుక్క శ్రీనివాస్, బల్ల చిన్న అంజయ్య, వీర బత్తిని రాజు, శంకరాచారి, అలువాల హనుమండ్లు, చెన్న నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 36









