జగిత్యాల జనవరి 23 : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా లోని జగిత్యాల, రాయికల్, కోరుట్ల,మెట్ పల్లి, ధర్మపురి మున్సిపాలిటీ లలో బిజెపి జెండా ఎగురవేసేలా బిజెపి నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పి.యం.ఆర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ,పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు , మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి,జిల్లా ఇంచార్జ్ గడ్డం శ్రీనివాస్,రాయికల్ మున్సిపల్ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి, ధర్మపురి మున్సిపల్ ఇంచార్జ్ బల్మూరు వనిత,జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి, వడ్డేపల్లి శ్రీనివాస్,జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్,Dr. రఘు,కన్నం అంజన్న,పిల్లి శ్రీనివాస్ మరియు జిల్లా మండల పదాధికారులు ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.బిజెపి ని ప్రతి వార్డులో గడప గడపకు తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.బిజెపి గెలుపు ప్రజలు గెలుపు గా భావించి అత్యధిక సంఖ్యలో ఓట్లు సాధించేలా కృషి చేయాలని కోరారు.









