వీణవంక జనవరి 23 : వీణవంక మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం సరస్వతి మాత పుట్టినరోజు, వసంత పంచమి పర్వదిన సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా జరిపారు. వసంత పంచమి ( శ్రీ పంచమి) సందర్భంగా సరస్వతీ మాత హోమము, పూజా, సామూహిక అక్షరాభ్యాసము కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈఉత్సవంలోఅక్షరాభ్యాసంలో 18మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. సుమారుగా ఈ కార్యక్రమంలో 60 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వారు పిల్లలకు నోట్స్, పెన్నులు పంపిణీ చేశారు.
Post Views: 3









