గంగాధర జనవరి 23 : గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ మరియు లెక్చరర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కళాశాల కార్యకలాపాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా పురోగతిలో తల్లిదండ్రులు–అధ్యాపకుల సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. గతంలో వివిధ రంగాలలో సక్సెస్ సాధించిన పూర్వ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కళాశాల అభివృద్ధి, విద్యార్థుల మెరుగైన ఫలితాల సాధన కోసం తల్లిదండ్రులు తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ప్రతి విద్యార్థికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు రిపోర్టును తల్లిదండ్రులకు అందజేసి, వారి విద్యా స్థితిగతులు, హాజరు, ప్రవర్తన అంశాలపై వివరంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.









