మల్యాల జనవరి 23 : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మల్యాల మండలంలోని అంగన్వాడి కేంద్రం- 11 లో అంగన్వాడీ కేంద్రంలో టీచర్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఘనంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక వార్డు సభ్యులు శనిగారపు తిరుపతి, కటుకూరి కావేరి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అన్నప్రాసనతో పాటు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిశువుల ఆరోగ్య పరిరక్షణలో మొదటి ఆరు నెలల పాటు తల్లిపాల ప్రాముఖ్యత ఎంతో కీలకమని, ఆరు నెలలు పూర్తైన తర్వాత పిల్లలకు అనుబంధ ఆహారం తప్పనిసరిగా అవసరమని తెలిపారు. ఈ అంశాలపై బాలింతలు, గర్భిణీ మహిళలకు అవగాహన కల్పించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో తల్లుల పాత్ర ఎంతో ముఖ్యమని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సంతోషి, ఆయా రేణుక, బాలింతలు, గర్భిణీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.









