మల్యాల జనవరి 24 : అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలలోకి గుంపులు గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ హడలెత్తిస్తున్నాయి.కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆకలితో అలమటిస్తూ ఊర్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. మల్యాల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురి చేస్తూ వారిపై దాడులు భయాందోళనకు గురి చేస్తూ వారిపై దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లో కోతుల దాడిలో గాయపడిన వారు చాలా మంది ఉన్నారు. ఇంటి తలుపులు వేయడం మరిచారో ఇక అంతే సంగతులు కోతులు ఇండ్లలోకి చేరి వంట సామాగ్రి, దుస్తులు, ఆహార పదార్థాలు చిందర వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి భయపడుతున్నారు.









