మల్యాల అక్టోబర్ 12 నవ వెలుగు :
కొండగట్టు అంజన్న ఆలయంలోని వేంకటేశ్వరస్వామిని శనివారం ముత్యంపేట గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. దాదాపు 20 ఏళ్లకు పైగా కొండగట్టు అంజన్న ఆలయంలోని వేంకటేశ్వరస్వామిని ముత్యంపేటలోని పురవీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఉత్సవమూర్తిని అశ్వవాహనంపై ప్రధాన వీధుల్లో ఊరేగించగా స్థానికులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కుల సంఘాల నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది,కొండగట్టు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.









