కార్యకర్త కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

navavelugunews.in
Date : 13 January 2026, 6:54 pm Posted By : NAVA VELUGU

కార్యకర్త కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

గంగాధర జనవరి 13 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గరిగంటి కరుణాకర్ నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గతంలోనే బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరుణాకర్ కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం కరుణాకర్ ఇంటికి వెళ్లి సొంతంగా రూ. 3 లక్షలు, ప్రభుత్వం తరఫున ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని కరుణాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పెద్దన్నలా అండగా ఉండి ఆదుకుంటామని పేర్కొన్నారు. కాగా కరుణాకర్ కుటుంబానికి అండగా ఉండి ఆదుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు చొప్పదండి నియోజకవర్గం ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అంబటి రజిత, సింగిల్ విండో మాజీ చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, సీనియర్ నాయకులు పుల్కం నర్సయ్య, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, స్థానిక సర్పంచ్ దానే ఒదేలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, మధురానగర్ సర్పంచ్ వేముల భాస్కర్, నాయకులు సాగి అజయ్ రావు, అట్లా శేఖర్ రెడ్డి, పడాల రాజన్న, ఈటవెణి శ్రీనివాస్, గునుకొండ బాబు, బుర్గు గంగన్న, అట్లా రాజిరెడ్డి, మంత్రి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు