హైదరాబాద్ జనవరి 21 : ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేదించుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఆధార్ దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లే ప్రతి రైతుకు 14 నంబర్లతో విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయా లనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. రైతులు తమ భూముల వివరాలను ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలు, రైతు ఆధార్ సంఖ్యకు అను సంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీ కేటాయిస్తారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు, ఏరకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరా లను ప్రామాణికంగా తీసుకొని రైతులకు ఫార్మర్ ఐడీలను కేటాయిస్తారు.
ఉపయోగాలు...
కేంద్ర-రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు
పీఎం- కిసాన్ సాయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి
రైతు వివరాలు కచ్చితంగా నమోదై పారదర్శకత పెరుగుతుంది.
బీమా, రాయితీలు, రుణాలు, ప్రభుత్వ పథకాలు త్వరగా అందుతాయి.
ఒకే ఐడీతో లబ్దిదారునికి నేరుగా బ్యాంకు ఖాతాలోకి లబ్ధి చేరుతుంది.
భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు సులభం, స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గుతాయి
అవసరమయ్యే పత్రాలు: ఆధార్ కార్డు నంబరు, భూమి పాసుపుస్తకం, ఆధార్ కు లింకైన ఫోన్ నంబర్.
ఎక్కడ చేస్తారు..?
రైతువేదికలోని ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారి) ద్వారా ఉచితంగా, సమీపంలోని మీసేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి రిజి స్ట్రేషన్ చేసుకోవచ్చు.









