తపస్ ఆధ్వర్యంలో అధికారులకు , ఉపాధ్యాయులకు క్యాలెండర్ లు అందజేత.

navavelugunews.in
Date : 21 January 2026, 6:16 pm Posted By : NAVA VELUGU

తపస్ ఆధ్వర్యంలో అధికారులకు , ఉపాధ్యాయులకు క్యాలెండర్ లు అందజేత.

కొడిమ్యాల జనవరి 21 : కొడిమ్యాల మండలం కేంద్రం లోని ప్రభుత్వ కార్యాలయాలు వివిధ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో తపస్ క్యాలెండర్ లను అందజేశారు. మొదటగా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రవికాంత్ కు, ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వరూపలకు తపస్ క్యాలెండర్ లను అందజేశారు. మండల విద్యాధికారి కార్యాలయం,ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొడిమ్యాలలో ప్రిన్సిపల్ వేణు మరియు అధ్యాపక బృందం లకు, మహిళా స్వశక్తి కార్యాలయం , వ్యవసాయ అధికారి కార్యాలయం ,గ్రామ పంచాయతీ కార్యాలయం , మండలం లోని వివిధ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులకు అందజేసి , పాఠశాలలలో క్యాలెండర్ లను గోడలపై అంటించారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకట రమణారావు, తపస్ మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి,జిల్లా బాధ్యులు గోనెపల్లి శ్రీనివాస్, కళ్యాణ్ ,రాజన్న ,శ్రావణి, మండల బాధ్యులు బొమ్మ సురేష్ , ఎర్రోజు మోహనా చారి, మన్మధ రెడ్డి, ఐలయ్య, నాగరాజు, దేవరాజo,భూపతి రెడ్డి, సతీష్,శ్రీధర్,మల్లేశం, విజయ్ కుమార్,గీత, పల్లవి, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు