కొడిమ్యాల ఫిబ్రవరి 17 (నవ వెలుగు) : గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ అధ్యాపకుడు మోదిగంపల్లి సురేష్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డును ఇటీవల ప్రకటించింది ఫిజిక్స్ విభాగంలో "డెవలప్మెంట్ ఆఫ్ ఫీజోఎలక్ట్రిక్ అండ్ ఫెర్రోఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఫర్ సెన్సార్ అప్లికేషన్స్" అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ K.సాధన గారి పర్యవేక్షణలో తన పరిశోధనను కొనసాగించి పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించడం జరిగింది. పరిశోధనను పరిశీలించిన విశ్వవిద్యాలయం ఇటీవల మోదిగంపల్లి సురేష్ కు డాక్టరేట్ ప్రకటించింది తన పరిశోధనకు సహకరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగమునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో మోదిగంపల్లి దేవయ్య-విజయ దంపతులకు సంతానంలో చివరి సంతానంగా జన్మించిన ఈయన జీవితంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక చెప్యాల గ్రామంలో పూర్తిచేసుకుని ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ మేడిపల్లి లో, డిగ్రీ కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పూర్తిచేసి మరియు ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ బీఈడీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే సెట్ ప్రవేశపరీక్ష రాసి ర్యాంకును సాధించి పీహెచ్డీ లో ప్రవేశం పొందాడు.కుటుంబ పోషణ కోసం అధ్యాపక వృత్తిని చేపట్టి కొనసాగుతున్నారు జీవితంలో ఎవరికి తలవంచకుండా అనేక ఆటుపోట్లను ఎదిరించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షతో ముందుకు సాగుతూ నేడు పీహెచ్డీ పట్టాను అందుకోవడంతో తన సహచరి లలిత చిన్నారులు హద్వితసూర్య, ప్రిషసూర్య తో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









