సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల భారీ ధర్నా.

navavelugunews.in
Date : 25 February 2026, 7:32 pm Posted By : NAVA VELUGU

సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల భారీ ధర్నా.

రాజన్నసిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 25 (నవ వెలుగు) : మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో...సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.తమ డిమాండ్ల సాధన కోసం కార్యాలయం ముందు బైఠాయించి,నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు కోడం రమణ, మూషం రమేష్ మాట్లాడుతూ...మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, మరణించిన వారు మరియు అనారోగ్యం కారణంతో పని చేయలేని కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 2009 నుండి 2012 వరకు పెండింగ్‌లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, విలీన గ్రామాలకు చెందిన కార్మికుల పీఎఫ్ నిధులను విడుదల చేయాలని కోరారు. కార్మికులందరికీ తక్షణమే ఈ.ఎస్.ఐ మరియు ఐడెంటిటీ కార్డులను అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మికుల నిరసనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో, కార్మికులు ధర్నా విరమించారు. అయితే కమిషనర్ ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకుంటే, వారం తర్వాత పనులు మానేసి,నిరవధిక సమ్మెకు దిగుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసారపు శంకర్, సిరిసిల్ల మున్సిపల్ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య, రాజయ్య, బాబా కిషన్, మమత, లక్ష్మి, యశోద, నరేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

రాజన్నసిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 25 (నవ వెలుగు) : మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో…సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.తమ డిమాండ్ల సాధన కోసం కార్యాలయం ముందు బైఠాయించి,నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు కోడం రమణ, మూషం రమేష్ మాట్లాడుతూ…మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, మరణించిన వారు మరియు అనారోగ్యం కారణంతో పని చేయలేని కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 2009 నుండి 2012 వరకు పెండింగ్‌లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, విలీన గ్రామాలకు చెందిన కార్మికుల పీఎఫ్ నిధులను విడుదల చేయాలని కోరారు. కార్మికులందరికీ తక్షణమే ఈ.ఎస్.ఐ మరియు ఐడెంటిటీ కార్డులను అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మికుల నిరసనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో, కార్మికులు ధర్నా విరమించారు. అయితే కమిషనర్ ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకుంటే, వారం తర్వాత పనులు మానేసి,నిరవధిక సమ్మెకు దిగుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసారపు శంకర్, సిరిసిల్ల మున్సిపల్ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య, రాజయ్య, బాబా కిషన్, మమత, లక్ష్మి, యశోద, నరేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు