వేములవాడ భీమేశ్వరుని సన్నిధిలో ప్రముఖ యాంకర్ సుమ.

navavelugunews.in
Date : 25 February 2026, 7:38 pm Posted By : NAVA VELUGU

వేములవాడ భీమేశ్వరుని సన్నిధిలో ప్రముఖ యాంకర్ సుమ.

వేములవాడ ఫిబ్రవరి 25 (నవ వెలుగు) : ప్రముఖ యాంకర్ సుమ కనకాల బుధవారం వేములవాడ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడె మొక్కును సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద మంత్రాలతో ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి గౌరవించారు.సుమ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది, అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు