పస లేని బడ్జెట్ – ప్రజలను పరేషాన్ చేసే బడ్జెట్. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

navavelugunews.in
Date : 23 March 2026, 7:35 pm Posted By : NAVA VELUGU

పస లేని బడ్జెట్ – ప్రజలను పరేషాన్ చేసే బడ్జెట్. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

గంగాధర మార్చి 23 (నవ వెలుగు) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేని, పసలేని బడ్జెట్‌గా ఉందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్‌లో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయకుండా అటకెక్కించారని, తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిపై చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెడతామని చెప్పిన బిఆర్ఎస్ నేతలు, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటిని ఆమోదించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షాల ప్రైవేట్ బిల్లులకు అనేక సందర్భాల్లో ఆమోదం లభించిందని గుర్తుచేశారు.

ప్రస్తుతం కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే అమలు అవుతోందని, మిగతా గ్యారంటీలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన 60 వేల ఉద్యోగాలను కూడా తమవేనని కాంగ్రెస్ చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

గత కాంగ్రెస్ పాలనలో నారాయణపూర్ రిజర్వాయర్ పనులను నిర్లక్ష్యం చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2000 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం నారాయణపూర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు