పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టర్‌కు మాజీ సర్పంచుల వినతి.

navavelugunews.in
Date : 23 March 2026, 7:41 pm Posted By : NAVA VELUGU

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టర్‌కు మాజీ సర్పంచుల వినతి.

గంగాధర మార్చి 23 (నవ వెలుగు) : 2019–2024 మధ్య కాలంలో గెలిచిన సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు సోమవారం కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో ఆ నిధులను గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో ఆ నిధుల నుంచే తాజా, మాజీ సర్పంచులకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించాలని కలెక్టర్ ని కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరంగా తెలియజేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం, నాయకులు మెచినేని నవీన్ రావు, శ్రీమల్ల మేఘరాజు, వేముల దామోదర్, బోల్లాడి శ్రీనివాస్ రెడ్డి, వడ్లూరి అదిమల్లు, సమ్మయ్య, మానకోండూర్ సర్పంచ్ పృధ్వీరాజ్, వంకాయగూడెం సర్పంచ్ సంపత్ గౌడ్, అడెపు రజిత, మేడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు