కథలాపూర్ మార్చి 26 (నవ వెలుగు) : జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత కథలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానం, రికార్డుల సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులతో సమీక్షిస్తూ, మ్యాపింగ్ పనుల పురోగతి, భూసేకరణ సంబంధించిన వ్యవహారాలు, భూ భారతీ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల అప్డేట్ పై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని భూ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ గుగ్గిళ్ల రమేష్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









