వేములవాడ మార్చి 28 (నవ వెలుగు) : వేములవాడలో పట్టణంలో నిర్వహిస్తున్న అఖిల భారత శ్రీ రాజరాజేశ్వరి రేణుక ఎల్లమ్మ గౌడ నిత్య అన్నదాన సత్రం సేవలు యావత్తు తెలంగాణ రాష్టానికి ఆదర్శమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.కల్మషం లేని మనసుతో చేస్తున్న ఈ సేవలను గౌడ కుల బాంధవులు విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా శనివారం కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో గౌడ సత్రం చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గౌడ కులస్తుల అభ్యున్నతికి కట్టుబడి సినీ నటుడు డాక్టర్ సుమన్ సారథ్యంలో వేములవాడలో గౌడ సత్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే గౌడ భక్తులకు నిత్యం అన్నదాన సేవలు అందించే ఈ సత్రం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందనీ పేర్కొన్నారు.తెలంగాణలో గౌడ సత్రం ద్వారా భక్తులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించడం అభినందనీయమన్నారు.ఇంత గొప్ప సేవా కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో సత్రం సమర్థవంతంగా నడవడం గర్వకారణమని తెలిపారు.భవిష్యత్తులో ఈ సత్రానికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.చిన్న వయసులోనే గౌడ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న మహంకాళి శ్రీనివాస్ గౌడ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.రానున్న రోజుల్లో ఈ సత్రం మరింత విస్తరించి మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు,కాశి పీఠాధిపతి శ్రీమాన్,బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రేగుల మల్లికార్జున్,బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కోల కృష్ణస్వామి,రాష్ట్ర నాయకులు దాది అశోక్,గౌడ సత్రం డైరెక్టర్లు సురగొని రాజు,భైరవుని దేవయ్య, అబ్బ గొని సురేష్,రావుల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









