పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న.

navavelugunews.in
Date : 28 March 2026, 4:50 pm Posted By : NAVA VELUGU

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న.

గంగాధర మార్చి 28 (నవ వెలుగు) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారమవుతోందని గంగాధర గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని గంగాధర గ్రామంలో ముద్రకోల రాజేశ్వరి–హన్మండ్లు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఇంటిలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న మాట్లాడుతూ “దశాబ్దాలుగా గూడు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరంగా మారిందని అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకోవాలి” అని సూచించారు. తమ సొంతింటి కల నిజం కావడంతో పాటు సర్పంచ్ స్వయంగా హాజరై నూతన వస్త్రాలు అందజేసి గౌరవించడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు