పెగడపల్లి మార్చి 28 (నవ వెలుగు) : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో కొలువై ఉన్నా అపర బద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీసీతారామ లక్ష్మణ భరత శత్రాఘునులను ఆంజనేయ బలరామకృష్ణులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండి వెంకన్న, ప్రధాన కార్యదర్శి మంత్రి హరిగోపాల్, కోశాధికారి రంగు ప్రభాకర్ గౌడ్,సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, గోలి రాజశేఖర్ రెడ్డి,ఉప సర్పంచ్ ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఆదినవేని తిరుపతి యాదవ్, క్యాస శ్రీరాములు,మ్యాకల మల్లేష్ యాదవ్, ఎడ్ల రవీందర్ రెడ్డి, పైండ్ల రాజేశం, కుంటాల విష్ణు, ఉప్పు రవీందర్, పుల్కం జలపతి, అడుప మహేందర్ తదితరులు పాల్గొన్నారు.









