కొండగట్టుకు కాలినడకన వెళ్లే స్వాములకు రేడియం స్టికర్లు, పండ్ల పంపిణీ.

navavelugunews.in
Date : 28 March 2026, 6:02 pm Posted By : NAVA VELUGU

కొండగట్టుకు కాలినడకన వెళ్లే స్వాములకు రేడియం స్టికర్లు, పండ్ల పంపిణీ.

కోరుట్ల మార్చి 28 (నవ వెలుగు) : హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు కాలినడకన బయలుదేరే హనుమాన్ దీక్ష స్వాములకు భద్రతను దృష్టిలో ఉంచుకుని కోరుట్లకు చెందిన ఫంకీ వరల్డ్ యజమాని ఎడ్ల రాజశేఖర్ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.ప్రతి సంవత్సరం వేలాదిగా భక్తులు రాత్రి వేళల్లో కాలినడకన కొండగట్టుకు చేరుకుంటారు. ఈ ప్రయాణంలో రోడ్లపై వాహనాల రాకపోకల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో, భక్తుల భద్రత కోసం ఈసారి వినూత్నంగా రేడియం స్టికర్లను పంపిణీ చేశారు. భక్తులు ధరించేలా ఈ రేడియం స్టికర్లు ఇవ్వడం ద్వారా చీకట్లో కూడా వారు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా, కాలినడకన వెళ్లే భక్తులకు పండ్లను పంపిణీ చేస్తూ వారి సేవలో భాగమయ్యారు. ఈ సేవా కార్యక్రమం భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంది.ఈ సందర్భంగా ఎడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ, భక్తులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం అని తెలిపారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు