దేవస్థాన ఈఓగా వి.అనూష బాధ్యతలు స్వీకరణ.

navavelugunews.in
Date : 30 March 2026, 7:34 pm Posted By : NAVA VELUGU

దేవస్థాన ఈఓగా వి.అనూష బాధ్యతలు స్వీకరణ.

కొడిమ్యాల మార్చి 30 (నవ వెలుగు) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన కార్యనిర్వాహణ అధికారి (ఈఓ)గా వి. అనూష బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈఓ వి. అనూష మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఆలయ నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, పూజా కార్యక్రమాలు నియమ నిష్ఠలతో కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అలాగే భక్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు, ఆలయ సిబ్బంది సహకారంతో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన ఈవో ఉడుత వెంకన్న వారితోపాటు కె.కమలాకర్ జి. రవీందర్ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు. అర్చక బృందం. ఆలయ సిబ్బంది, నరసయ్య నరేష్ భక్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు