వేములవాడ జూన్ 5 (నవ వెలుగు) : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం తమ జన్మదిన సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న మేడిపల్లి సత్యం కి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతంతో ఆహ్వానం పలికారు.అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
Post Views: 26







