గంగాధర జూలై 12 : గంగాధర మండలం వెంకంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల పిట్టలపల్లి గ్రామానికి చెందిన పిట్టల రవి (50) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పిట్టల రవి పని నిమిత్తం 30 సంవత్సరాలు సౌదీ దేశంలో పని చేసి, 8 నెలల క్రితం ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతడి కొడుకు, కోడలు రవి సౌదీ నుంచి వచ్చిన మరుసటి రోజు నుంచి వ్యవసాయ భూమిని కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని శారీరకంగా, మానసికంగా హింసించారని, వారి బాధను తట్టుకోలేక జూలై 11 న భూమి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు తేవాలని, దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోగా మృతుడు రవి మనస్థాపానికి గురై శనివారం ఉదయం భార్యకు పొలం దగ్గరికి వెళ్లి వస్తా అని చెప్పి ఎంతసేపటి భర్త ఇంటికి రాకపోయే సరికి అల్లుడు కటుకం సతీష్ (33) మధురానగర్ కు ఫోన్ చేసి చెప్పగా అతడు వెళ్ళి చూసే సరికి పొలం దగ్గర ఉన్న చింత చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడని మృతుడి భార్య జమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.









