రుద్రంగి ఏప్రిల్ 7 (నవ వెలుగు) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో ఏఎంసీ పరిధిలోని డిసిఎంఎస్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 2400 రూపాయల మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. రైతులకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అందుకే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చామని అలాగే రైతు ఋణమాఫీ చేశామని అన్నారు. వ్యాసాయనికి కావలసిన పనిముట్లను కూడా సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వరి పంట పొలాలకు ఎల్లంపల్లి నీరు కూడా అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, పల్లి గంగాధర్,గడ్డం స్వామి, కేసిరెడ్డి నర్సారెడ్డి, సనుగుల గంగాధర్, అక్కెనపెల్లి శ్రీనివాస్, దువ్వక గంగాధర్, కట్కూరి దాసు, దాసరి గంగరాజం, ఎర్రం రాజలింగం, దయ్యాల శ్రీనివాస్, వార్డు మెంబర్లు, అధికారులు, మార్కెట్ డైరెక్టర్లు నాయకులు పాల్గొన్నారు.









