జగిత్యాల ఏప్రిల్ 7 (నవ వెలుగు) : జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. సుమారు 14 మంది అధికారులతో కూడిన బృందం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది రెండవసారి సోదాల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఆ విభాగంపై ప్రత్యేకంగా పరిశీలన కొనసాగిస్తున్నారు.గత కొంతకాలంగా మున్సిపల్ కార్యాలయంలో వివిధ సేవల విషయంలో అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులు అధికంగా రావడంతో ఏసీబీ ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.పత్రాలు, లావాదేవీల వివరాలు, ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.









