మల్యాల జూన్ 5 (నవ వెలుగు) : చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ శాసనసభ్యులు మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను మల్యాల గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్యాల గ్రామపంచాయతీ సర్పంచ్ బొట్ల జయ ప్రసాద్ గారి అధ్యక్షతన గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రామంలోని స్థానిక రామాలయం గుడి ప్రాంగణంలో సర్పంచ్, వార్డు సభ్యులు మరియు పాలకవర్గ ప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బొట్ల జయ ప్రసాద్ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వంలో మల్యాల గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు









