మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై తనకున్న నిష్కల్మషమైన ప్రేమాభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.గ్రామానికి చెందిన దూస మహేష్ అనే యువకుడు బండి సంజయ్ చిత్రాన్ని ఏకంగా తన చేతిపై టాటూగా చెక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు.బండి సంజయ్ అన్న నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా పోరాడే నైజం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా గుండెల్లో ఉన్న నా అభిమాన నాయకుడి రూపం ఎప్పటికీ నాతోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ టాటూ వేయించుకున్నాను."తన అభిమాన నాయకుడి రూపాన్ని నిత్యం తనతోనే ఉంచుకోవడం పట్ల మహేష్ తీవ్ర ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశాడు.









