మల్యాల : మల్యాల మండల కేంద్రానికి చెందిన దొంతరవేణి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి,మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ మంగళవారం వారి నివాసానికి చేరుకుని, లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా లక్ష్మయ్య కుమారుడు దొంతరవేణి శేఖర్ సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్,మాజీ సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి, మాజీ ప్యాక్స్ చైర్మన్ సాగర్ రావు, నాయకులు గడ్డం రాజేశ్వర్, పోతరాజు శ్రీనివాస్,సంత గౌతంరెడ్డి,కట్కూరి అరుణ్, బట్టు నవీన్, జవాజి శ్రీనివాస్, సంఘ సత్తన్న, పూడూరి చందు, రవి, సలీం, వంగలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









