కొడిమ్యాల : కొడిమ్యాల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు, కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ తో కలిసి బహుమతులను అందజేశారు. అంతకుముందు జీవన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రాణించి కొడిమ్యాల మండలానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు .ఎంఈఓ ఐత శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బూట్ల రాజామల్లయ్య, కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మండల పోటీల నిర్వహణకు సహకరించి బహుమతులను అందజేసిన ఇండోర్ స్కూల్ కరస్పాండెంట్ బాబీ జోసెఫ్ కు కన్వీనర్ ధన్యవాదాలు తెలిపారు.ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య మాట్లాడుతూ కొడిమ్యాల లో నిర్వహించే ప్రతి క్రీడా కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్ జి ఎఫ్) జిల్లా కన్వీనర్ టి .చక్రధర్ రావు మాట్లాడుతూ ఎస్జిఎఫ్ మండల స్థాయి పోటీల నిర్వహణలో జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం చక్కగా నిర్వహించిందని అభినందించారు. కొడిమ్యాల మండల కమిటీ కోరిక మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 17 బాల, బాలికల వాలీబాల్ పోటీలు కొడిమ్యాలలో నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.గత 3 రోజుల నుండి ఉత్సాహంగా జరుగుతున్న క్రీడలలో మండల ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన వాలీబాల్ ,కోకో, కబడ్డీ మరియు అథ్లెటిక్స్ లో గెలిచిన అండర్ 14 ,17 బాల బాలికలకు కప్ లతో పాటుగా బంగారు,వెండి పతకాలను అందజేశారు. ఈనాటి ఫైనల్ కబడ్డీ కి ముఖ్యఅతిథిగా ఎస్సై నరేష్ హాజరై టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.బహుమతి ప్రధాన కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి టి. చక్రధర్ రావు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ జిల్లా నోడల్ అధికారి ఒడ్నాల శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్, మండల కన్వీనర్ బూట్ల రాజమల్లయ్య ,జిల్లా మాజీ కన్వీనర్ లక్ష్మీ రామ్ నాయక్, తపస్ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి ,పిఆర్టియు నాయకులు అంజయ్య, మన్మధ రెడ్డి ,భాస్కర్, శ్రీనివాస్ ,ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య ,శివకృష్ణ ,అనూప్ రెడ్డి, గంగాజల, అఖిల, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.









