మల్యాల : మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీకి బలమైన, పటిష్టమైన పునాదులు వేసిన మహానీయులలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రముఖుడని కొనియాడారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలనే లక్ష్యంతో ఆయన అందించిన మార్గదర్శకత్వం ప్రతి కార్యకర్తకూ స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గాజుల మల్లేశం, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి వెంకటస్వామి యాదవ్,మాజీ ఎంపీటీసీ రాచల్ల రమేష్,నాయకులు నులుగొండ సురేష్,జనగాం రాములు,గౌతం రాజు,రాజు తదితరులు పాల్గొన్నారు.









