మల్యాల : మల్యాల గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డిజె సౌండ్ సిస్టమ్స్ నిర్వహించిన ఇద్దరు ఆపరేటర్లపై కేసు నమోదు చేయడంతో పాటు రెండు డిజె సౌండ్ సిస్టమ్స్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా నిన్న రాత్రి ఆపరేటర్లు పిల్లి శ్రీనివాస్, సామంతుల రాజు ప్రధాన రహదారిపై అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హోరెత్తించే శబ్దాలతో సౌండ్ సిస్టమ్ నిర్వహించడంతో స్థానికులకు, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది.దీనిపై స్పందించిన మల్యాల పోలీసులు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిద్దరిపై కేసు నమోదు చేసి డిజె సిస్టమ్స్‌ను సీజ్ చేశారు. రాత్రి వేళల్లో అధిక శబ్దాలతో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఎస్.సందీప్ హెచ్చరించారు.









