మల్యాల : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న న్యాయమూర్తికి పోలీసులు మార్చ్ పాస్ట్‌తో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయ ఈవో అంజనా రెడ్డి నేతృత్వంలో అర్చకులు, ఆలయ అధికారులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జస్టిస్ ఈవీ వేణుగోపాల్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సి. రత్నా పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు, ఇతర ఆలయ అధికారులు సునీల్ కుమార్,శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









