మల్యాల: మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.హారిక రాష్ట్ర స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 20న సుల్తానాబాద్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ మానస తెలిపారు. ఈ సందర్భంగా హారికతో పాటు పిఇటి మధులికను ప్రిన్సిపాల్, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.
Post Views: 5









