మల్యాల : మల్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ అవినీతిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మల్యాల మాజీ ఎంపీటీసీ రాచర్ల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మల్యాల ప్రజావాణి నోడల్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతా నుండి నేరుగా ఒప్పంద మరియు సహాయ ఉద్యోగులకు చెక్కులు బదిలీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు గురైన చెక్కులను రికవరీ చేసి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఆడిటింగ్ అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దారి మళ్లించిన చెక్కుల వివరాల ఫోటో కాపీని వినతిపత్రానికి జత చేశారు.
Post Views: 24









