ఇళ్లలోకి చొరబడి సామాగ్రి ధ్వంసం.. పిల్లలు, వృద్ధులపై దాడులు. తక్షణమే మంకీ క్యాచర్లను రప్పించాలని స్థానికుల వేడుకోలు..

గురువారం, 26 నవంబర్, 2026
TIME : 07:10 AM

ఇళ్లలోకి చొరబడి సామాగ్రి ధ్వంసం.. పిల్లలు, వృద్ధులపై దాడులు. తక్షణమే మంకీ క్యాచర్లను రప్పించాలని స్థానికుల వేడుకోలు..

మల్యాల : మల్యాల మండల కేంద్రంతో పాటు ముత్యంపేట, మల్యాల ఎక్స్ రోడ్ తదితర పరిసర గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా పెరుగుతున్నాయని మాజీ ఎంపీటీసీ రాచర్ల రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు .గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వానర మూకలు ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మండల పరిధిలోని గుట్టల ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతున్న గ్రానైట్ మైనింగ్, అడవుల నరికివేత కారణంగా కోతులకు సహజ ఆవాసాలు, ఆహార వనరులు కనుమరుగయ్యాయి.

పండ్ల చెట్లు లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు కోతులు గుంపులుగా జనావాసాలపై దాడి చేస్తున్నాయి.ఇళ్లలోకి దూరి వండిన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, విలువైన సామాగ్రిని కోతులు చిందరవందర చేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. అంతేకాకుండా, వాటిని తరిమేందుకు ప్రయత్నించిన వృద్ధులు, చిన్నపిల్లలపై ఎదురుదాడికి తెగబడుతున్నాయి. మల్యాల ఎక్స్ రోడ్ వంటి ప్రధాన కూడళ్లలో చిరువ్యాపారుల పండ్లు, కూరగాయలను ఎత్తుకెళ్తుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల జిల్లాలో కోతుల దాడుల వల్ల ప్రాణనష్టం కూడా జరిగిన నేపథ్యంలో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

⬇ DOWNLOAD
×

మల్యాల : మల్యాల మండల కేంద్రంతో పాటు ముత్యంపేట, మల్యాల ఎక్స్ రోడ్ తదితర పరిసర గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా పెరుగుతున్నాయని మాజీ ఎంపీటీసీ రాచర్ల రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు .గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వానర మూకలు ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మండల పరిధిలోని గుట్టల ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతున్న గ్రానైట్ మైనింగ్, అడవుల నరికివేత కారణంగా కోతులకు సహజ ఆవాసాలు, ఆహార వనరులు కనుమరుగయ్యాయి. పండ్ల చెట్లు లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు కోతులు గుంపులుగా జనావాసాలపై దాడి చేస్తున్నాయి.ఇళ్లలోకి దూరి వండిన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, విలువైన సామాగ్రిని కోతులు చిందరవందర చేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. అంతేకాకుండా, వాటిని తరిమేందుకు ప్రయత్నించిన వృద్ధులు, చిన్నపిల్లలపై ఎదురుదాడికి తెగబడుతున్నాయి. మల్యాల ఎక్స్ రోడ్ వంటి ప్రధాన కూడళ్లలో చిరువ్యాపారుల పండ్లు, కూరగాయలను ఎత్తుకెళ్తుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల జిల్లాలో కోతుల దాడుల వల్ల ప్రాణనష్టం కూడా జరిగిన నేపథ్యంలో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Nava Velugu - Editor Reporter
navavelugunews.in

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు