ఇబ్రహీంపట్నం మే 30 (నవ వెలుగు): వేసవికాలంలో మే నేలలో ఎండలు మెండు అన్నట్లు గానే భానుడి ప్రతాపం తీవ్రంగా కనిపిస్తున్నది. ఎండకు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు జన సంచారం లేక ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ త్రీవ్రతకు వినియోగదారులు రాకవ్యాపార దుకాణాలు వెలవెలబోతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. వడదెబ్బ తగిలి అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. వేడి గాలుల ప్రభావం, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు నీరసించిపోతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా గడిపే పరిస్థితి లేదు. పొద్దంతా ఎండ తీవ్రత, వడగాలులు, రాత్రిపూట ఉక్కపోతతో జనం అతలాకుతలమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మధ్యాహ్నం 3 గంటలకు 43 డిగ్రీలకు పెరిగింది. ఎండ తీవ్రతకు మనుషులే కాదు పక్షులు, జంతువులు అల్లాడిపోయి. చెట్ల కింద చేరి ఎండ నుండి విముక్తి పొందుతున్నారు. అగ్ని ప్రమాదాల హెచ్చరిక..... ఎండ తీవ్రత, వడగాలులతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏ కొంచెం మినుగు (నిప్పు తున) పడిన సుర్రు మంటూ మంటలు చేలరేగి ఆటవీ ప్రాంతాలను చుట్టు ముట్టుతున్నాయి. గీత కార్మికులకు జీవనాధారమైన ఈత వనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.వడ దెబ్బతో అప్రమత్తంగా ఉండాలి. ఎండవేడికి బయట తిరుగుడ్లని, మజ్జిగ, కొబ్బరి నీల్లు తీసుకోవలని, నిరసనగా ఉంటే వెంటనే సమీపంలోని ఆసుపత్రి లో సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.









