ధాన్యం త్వరితగతిన మిల్లులకు తరలించాలి. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.

శనివారం, 30 మే, 2026
TIME : 08:37 PM

ధాన్యం త్వరితగతిన మిల్లులకు తరలించాలి. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.

గంగాధర మే 30 (నవ వెలుగు) : గంగాధర మండల పరిధిలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కురిక్యాల, మధురానగర్, మంగపేట, వెంకటయ్యపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్, ప్రస్తుతం నిల్వ ఉన్న ధాన్యాన్ని రెండు నుంచి మూడు రోజుల్లోగా వాహనాలను సమకూర్చి మిల్లులకు త్వరితగతిన తరలించాలని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించిన తర్వాత

ఎక్కువకాలం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ధాన్యం కుప్పలను పూర్తిగా కప్పి భద్రపరచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతుల కష్టానికి తగిన ఫలితం అందేలా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలలో జిల్లా సరఫరాల అధికారి (డీఎస్ఓ) నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్ (డీఎం) రజనీకాంత్, జిల్లా సహకార అధికారి (డీటీసీఎస్) ఉష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

గంగాధర మే 30 (నవ వెలుగు) : గంగాధర మండల పరిధిలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కురిక్యాల, మధురానగర్, మంగపేట, వెంకటయ్యపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్, ప్రస్తుతం నిల్వ ఉన్న ధాన్యాన్ని రెండు నుంచి మూడు రోజుల్లోగా వాహనాలను సమకూర్చి మిల్లులకు త్వరితగతిన తరలించాలని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించిన తర్వాత ఎక్కువకాలం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ధాన్యం కుప్పలను పూర్తిగా కప్పి భద్రపరచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతుల కష్టానికి తగిన ఫలితం అందేలా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీలలో జిల్లా సరఫరాల అధికారి (డీఎస్ఓ) నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్ (డీఎం) రజనీకాంత్, జిల్లా సహకార అధికారి (డీటీసీఎస్) ఉష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Nava Velugu - Editor Reporter
navavelugunews.in

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు